PPM: జిల్లాలోని చెరువులు ఆక్రమణకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, వాటిని పరిరక్షించవలసిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని, కావున రెవిన్యూ, పోలీస్, సర్వే అధికారులు చెరువులను, వాటి సరిహద్దుల గుర్తించాలన్నారు.