NDL: ఇండియన్ మెడికల్ పార్లమెంటేరియన్స్ ఫోరమ్ (IMPF) జాయింట్ కన్వీనర్‌గా NDL ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, ఇండియన్ మెడికల్ పార్లమెంటరియన్స్ ఫోరమ్ ఛైర్ పర్సన్ జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.