SS: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆధ్వర్యంలో ధర్మవరంలోని శ్రీ సాయిరాం ఐటీఐ కళాశాలలో ఈనెల 30న 9 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉద్యోగాల పేరిట డబ్బులు డిమాండ్ చేసినా లేదా మంత్రి పేరుతో వసూలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కార్యాలయ ఇంఛార్జ్ హరీశ్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.