ADB: రూరల్ మండలంలోని యాపల్ గూడ లో సోమవారం భూభారతి ఆర్ఓఆర్ యాక్ట్ పై రైతులు, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భూసమస్యలు గల రైతుల నుండి సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తదితరులున్నారు.