శ్రీకాకుళం: జిల్లాలో ఇవాళ అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని X ఖాతా ద్వారా సూచించింది. బూర్జ, జి. సిగడాం, హిరమండలం, కొత్తూరు, లావేరు, లక్ష్మినరసంపేట్, పాతపట్నం, పొందూరు మండలాల్లో మోస్తరు పాటు వర్షం పడే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.