PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో వన్ ధన్ వికాస కేంద్రం ద్వారా జీడిపిక్కలు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి గురువారం ప్రారంభించారు. గిరిజనులు దళారుల వద్ద మోసపోకుండా ఉండేందుకు ఈ VDVK కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని గిరిజన రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.