VZM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పంచాయతీ రాజ్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాలను అభివృద్ధి చేయుటకు పూర్తి అధికారాలు గ్రామ స్థాయిలో పంచాయతీలకు కల్పించారన్నారు.