పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల మధ్య చివరిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీలలో మాత్రమే భారత్, పాకిస్థాన్ ఆడుతున్నాయి. తాజా ఘటనతో శాశ్వతంగా ద్వైపాక్షిక సిరీస్లను నిర్వహించొద్దని బీసీసీఐ నిర్ణయించింది.