NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్కపల్లి మండలానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రుల నుండి ఎదురైన మందలింపులకు మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఈ ఘటన స్థానికంగా కన్నీరు మున్నేరు అయింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.