SRD: వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రామచందర్ శనివారం ప్రకటనలో కోరారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. సెలవుల్లో బదిలీలు నిర్వహిస్తే ఉపాధ్యాయులకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పారు.