VZM: తెర్లాం మండలం పూనువలస పంచాయతీ పరిధిలోని పెదపాలవలస గ్రామంలో పారిశుద్ధ్య పనులను శనివారం చేపట్టారు. ఈ పనులను పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అన్ని వీధుల్లో గల వీధి కాలువల్లో పూడికలను తొలగించనున్నట్లు కార్యదర్శి తెలిపారు. ప్రజలు చెత్తాచెదారాలను కాలువలో వేయవద్దని కోరారు.