SRD: సిర్గాపూర్ మండలం రూప్లా తండాలో ఎంపీడీఓ మల్సూర్ నాయక్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీలో నిర్వహించారు. ఇన్ఛార్జ్ సెక్రటరీ భీమేష్ ప్రజాపాలనలో దరఖాస్తులు చ్చిన లబ్ధిదారుల పేర్లను చదివారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఎంపీడీవో పేర్కొన్నారు.