»Sanghtan Farmer Leader Sharad Joshi Praneet Joined Brs
CM KCR : బీఆర్ఎస్లో చేరిన సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్
దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపునిచ్చారు. 14 మంది ప్రధానులు మారిన దేశ ప్రజల తల రాత మాత్రం మారలేదని అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపునిచ్చారు. 14 మంది ప్రధానులు మారిన దేశ ప్రజల తల రాత మాత్రం మారలేదని అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర (Maharashtra) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. మెజారిటీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. రైతుల నాయకత్వంలో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ (BRS)గెలుపు కోసం కమిటీలు వేస్తామని, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ సూచించారు. విదర్భలో భారీ బహిరంగ సభ పెడదామని అన్నారు.
రైతుల పోరాటం న్యాయబద్ధమైనది. తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. చిత్తశుద్ధితో పని చేస్తే గెలిచి తీరుతాం. నా 50 ఏండ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాను. తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి అని కేసీఆర్ రైతు నేతలకు సూచించారు.13 నెలల పాటు దేశ రాజధానిలో రైతులు (Farmers)పోరాడారు అని కేసీఆర్ గుర్తు చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులను ఉగ్రవాదులన్నారు.. ఖలీస్తానీలన్నారు.. వేర్పాటువాదులన్నారు. రైతుల పోరాటంతో ప్రధాని మోదీ (PM Modi) దిగివచ్చి క్షమాపణ చెప్పారు. 750 మంది రైతులు చనిపోతే ప్రధాని కనీసం స్పందించలేదు. మన దేశంలో దేనికి కొదవ లేదు. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవారు అని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేశాక రైతుల ఆత్మహత్యలు ఆగాయి. రైతుల గోస చూసి నాకు కన్నీళ్లు వచ్చేవి. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పండుతుంది. అందులో 56 లక్షల ఎకరాల వరి తెలంగాణలోనే పండుతుంది అని కేసీఆర్ తెలిపారు.