CTR: సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ ఇటీవల మృతి చెందిన విషయం విధితమే. బుధవారం నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆమె సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు, పలమనేరు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సప్తగిరిని పరామర్శించారు.