GNTR: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడిపై ట్విట్టర్లో అసభ్యకరంగా పోస్టులు చేసిన గూడూరుకు చెందిన పుష్పరాజ్‌ను ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీపై ద్వేషంతో నకిలీ ఖాతాల ద్వారా బూతులు పోస్ట్ చేసినట్టు ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు.