»Journalists Need To Improve Their Skills Allam Narayana
Allam Narayana : జర్నలిస్టులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి : అల్లం నారాయణ
తెలంగాణ రాష్ట్ర మీడియా ఆకాడమి ఆధ్వర్యంలో భూపాలపల్లి లో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ (Media Academy Chairman) అల్లం నారాయణప్రారంభించారు. స్థానిక ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy), భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర మీడియా ఆకాడమి ఆధ్వర్యంలో భూపాలపల్లి లో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ (Media Academy Chairman) అల్లం నారాయణ ప్రారంభించారు. స్థానిక ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (MLA Gandra Venkataramana Reddy), జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జర్నలిస్టులకు తరగతులు నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమమే(Journalists Welafare) ధ్యేయంగా మీడియా అకాడమీపనిచేస్తుందని మీడియా అకాడమీ చైర్మన్(Media Academy Chairman) అల్లం నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు(Training Classes) ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు.
ప్రతి జర్నలిస్ట్ ఈ శిక్షణ తరగతులు సధ్వినియోగం చేసుకుని నైపుణ్యాలను మెరుగుపర్చు కోవాలన్నారు. నైతికత ఉన్న జర్నలిస్ట్ ఉత్తమ జర్నలిస్ట్ గా ఎదుగుతారని ఆయన సూచించారు. తెలంగాణ మీడియా(Telangana Media) ఆధ్వర్యంలో రాష్ట్రమంతా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు(Accreditations) ఇప్పించామని అన్నారు. జర్నలిస్టుల (Journalists) సంక్షేమానికి ప్రభుత్వం రూ. 42 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని వివరించారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు రూ. 7 కోట్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు పాల్గొన్నారు.