ప్రకాశం: జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, పామూరు సీఐ ఎం బీమా నాయక్ ఆధ్వర్యంలో బుధవారం పామూరులో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. దొంగతనాల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీ ప్రాంతాలలో సంచరిస్తుంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.