SKLM: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం తప్పదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలో సోమవారం ధర్నా చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. చనిపోయిన, రిటైరైన కార్మికుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని కోరారు.