సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని మండ్లి, ముద్దపుకుంట, కొల్లకుంట గ్రామాలలో రేపు, ఎల్లుండి విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ శేషగిరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. 220 కెబి విద్యుత్ లైన్ మరమ్మత్తుల కారణంగా ఈ మూడు గ్రామాలలో మంగళవారం, బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.