WGL: జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లయ్య బోడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు అనిల్ (8)మృతి చెందిన విషయం తెలిసిందే. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు డ్రైవర్‌ను చితకబాదడంతో డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్ లారీ డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.