SRD: రాయికోడులోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో శివ రుద్రప్ప బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 17న ధ్వజారోహణం, 18న మహా రుద్రాభిషేకం, 19 సహస్ర బిల్వర్చన, 20న బిల్వర్చన, 21న అభిషేకం, 22న రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.