HYD: నగరంలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్డీ వెంకటాచారి ఆదేశించారు. జిల్లాలో 73 కేంద్రాల్లో 15,068 మంది విద్యార్థులు హాజరవుతారు. సెల్ఫోన్లను అనుమతించరని, 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయన్నారు.