ASR: గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలోని పారిశుద్ధ్యం పడకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్న పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో కురుస్తున్న వర్షాలకు అది మొత్తం తడిసిపోయి దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.