SKLM: నరసన్నపేట మండలం, మండపాం హైవే బ్రిడ్జ్ పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.