KMM: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఎర్రుపాలెం(M) జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని శుక్రవారం సుప్రీంకోర్టు మాజీప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా మాజీ ప్రధాన న్యాయమూర్తిని అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తదనంతరం అర్చకులు మాజీ న్యాయమూర్తిని స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.