ATP: గుత్తి పట్టణ శివార్లోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం బొలెరో వాహనం బైక్ ఢీకొంది.ఈ ప్రమాదంలో బైక్ మీద వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.