మగవాళ్లతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపే పురుషులను లక్ష్యంగా చేసుకుని కామారెడ్డిలోని ముఠా బెదిరింపులకు పాల్పడుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ ముఠా పురుషులకు వల విసురుతుంది. స్పందించిన వారిని పురుషులతో ఏకాంతంగా గడిపేలా చేస్తారు. అలా వారి వీడియోలు తీసి.. డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇందుకోసం కామారెడ్డిలో ఒక డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.