NLG: చందంపేట మండలం పోలేపల్లి వద్ద బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుంటోజు వినోదాచారి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ మండల సమావేశం నిర్వహించారు. ఈనెల 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.