కోనసీమ: ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి ఎస్సైగా పదోన్నతి పొందారు. ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు మేరకు పదోన్నతి లభించడంతో కోనసీమ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు… రమణారెడ్డిని రావులపాలెం అదనపు ఎస్సైగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రమణారెడ్డి రావులపాలెం అదనపు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.