అనకాపల్లి: మాకవరపాలెం నూతన ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు(సర్వం) శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ మాట్లాడుతూ.. మండలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.