బాపట్ల: నాటుసారా తయారీలో ఉపయోగించే నల్లబెల్లం విక్రయాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు బెల్లం వ్యాపారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన తన ఆఫీస్లో బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీ నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బెల్లం వ్యాపారులపై కూడా నిఘా ఉంటుందని సీఐ వారికి స్పష్టం చేశారు.