VKB: ధారూర్ మండలంలోని సంగయేపల్లి తండ అటవీ ప్రాంతంలో కొందరు జీడి గింజలతో నాటుసారా తయారు చేస్తున్నారు. ధారూర్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ రాజేందర్ సిబ్బందితో కలిసి దాడిచేసి సామాగ్రిని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. జీడి గింజలతో తయారు చేస్తున్నట్లు పరిశీలనలో ఆనవాళ్లు లభ్యమయ్యాయని, ఓ వ్యక్తి అడవిలో పారిపోవడం గమనించామన్నారు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.