PDPL: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్ &రామగుండం కార్పొరేషన్ ఇంఛార్జ్ కమిషనర్ అరుణ శ్రీ పేర్కొన్నారు. డివిజన్లలో ఉన్న సమస్యలను తీర్చేందుకు ఆన్లైన్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 14420 నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.