VSP: ప్రపంచమంతా జీబ్లీ ట్రెండ్ నడుస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ ఫొటోలను AI ఇమేజ్‌లుగా మార్చుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ అందాలను సైతం కొందరు జీబ్లీ ఇమేజ్‌లుగా మార్చారు. విశాఖలోని మెయిన్ సెంటర్స్, సింహాచలం దేవస్థానం, ఏయూ, బీచ్ రోడ్డు, కైలాసగిరి విజువల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.