MBNR: చెరువును కబ్జా చేసినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే అన్న జనంపల్లి దుష్యంత్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి అనుచరులు ఈ పని చేసినట్లు సమాచారం. ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ప్రజల మండిపడుతున్నారు.