CTR: పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు సకాలంలో ఇంటి పన్ను, ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ పేర్కొన్నారు. ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేయడం లేదని సూచించారు. సకాలంలో పనులు చెల్లించి పుత్తూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఆదివారం, సెలవు రోజులలో కూడా మున్సిపల్ కార్యాలయం ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.