KRNL: ఆలూరు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజవకర్గ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు టీడీపీ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.