కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ క్యాంపస్‌ని మూసివేస్తున్నట్లు శుక్రవారం అధికారులు ప్రకటించారు. దీంతో ఐఐటి అకాడమి గేటు ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగి ఇదే క్యాంపస్‌లో కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. గురుకుల ఐఐటి క్యాంపస్‌లో చదువుతున్న 472మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతాయని అన్నారు.