TPT: నాగలాపురం మండలంలోని నాగలాపురం, సుబ్బనాయుడు కండ్రిగ, బీరకుప్పం సబ్స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీ రమేశ్ చంద్ర తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5గంటల వరకు విద్యుత్ సబ్స్టేషన్ మెయింటేనెన్స్ మరమ్మతు పనులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.