MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభ చూపారు. వ్యక్తిగత విభాగంలో దీక్షిక నేహా ద్వితీయ బహుమతి, అలాగే సామూహిక విభాగంలో అక్షయ్, దివిజేంద్రలకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ శ్రీనివాస్ చౌదరి సైన్స్ అధ్యాపకులు ప్రశంసించారు.