KNR: ఇండియా క్రికెట్ టీం ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందిన సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రాత్రి 10: 40 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో బాణా సంచాలు పేల్చి సంబరాలు జరిపారు. భారత క్రికెట్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.