NLG: పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండలో ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుపేద కుటుంబానికి ఇళ్లు వస్తాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరేశం, జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.