NZB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.