KDP: జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజులపాటు పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం పులివెందులకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. అనంతరం బెంగళూరుకు జగన్ బయలుదేరి వెళ్తారు.