ప్రకాశం: గిద్దలూరులో అర్బన్ సిఐ సురేష్ ఆధ్వర్యంలో సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలానే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు.