అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. మేక్రాన్ ఓవల్ ఆఫీసులో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తున్నందున యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ఆకాంక్షించారు. తాము తెలివైన వాళ్లమైతే అది కొన్ని వారాల్లోనే జరగొచ్చని వ్యాఖ్యానించారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ నియంత కాదని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు నియంతని ఇటీవల ట్రంప్ అభివర్ణించారు.