VSP: గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాతవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్లు ప్రమాదాల నివారణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు.