KMM: ఖమ్మం నగరంలోని VDO’S కాలనీలో ఉన్న రామాలయంలో శనివారం నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటికి ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.