HYD: తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రకటన చేసిన సందర్భంగా శనివారం ఉదయం నుంచి డాక్టర్ ఏఎస్ రావు నగర్లో మీ సేవల వద్ద ప్రజలు క్యూ కట్టారు. మీసేవ కేంద్రాల వద్ద నో సర్వర్ బోర్డు పెట్టారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నో సర్వీస్ రావడంతో ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.