PLD: అడవులను కాపాడుకుంటేనే శ్రీరామ రక్ష అని అటవీ రేంజ్ అధికారులు, సిబ్బందితో జరిగిన సమీక్షా సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటూ, పచ్చదనాన్ని పరిరక్షించాలని సూచించారు. నియోజకవర్గంలో మొక్కలు సంరక్షణ ఎలా అనే విషయంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.